»Mp Avinash Reddy On Viveka Murder Case On Bail Petition Telangana
MP Avinash Reddy: వివేకా హత్య కేసులో నాకు సంబంధం లేదు
వైఎస్ వివేకా హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) తన ముందస్తు బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. సునీతకు, వివేకా రెండో భార్యకు మధ్య వివాదాలున్నాయని గుర్తు చేశారు.
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి(Ys Vivekaananda Reddy) హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసలు ఈ కేసులో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. దస్తగిరి వాంగ్యూలం ప్రకారమే తనను సీబీఐ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ సీబీఐ ఆఫీసులో అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టులో ఎంపీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో కీలక విషయాలు అవినాష్ రెడ్డి ప్రస్తావించారు.
వైఎస్ వివేకా కుమార్తె సునీత..సీబీఐ సహా స్థానిక ప్రతిపక్ష ఎమ్మెల్సీ నేతతో కలిసి తనపై కుట్ర పన్నిందని పేర్కొన్నారు. అంతేకాదు సునీతకు వివేకా రెండో భార్యకు మధ్య గొడవలు ఉన్నట్లు తెలిపారు. దీంతోపాటు వివేకానంద రెడ్డి..తన రెండో భార్య కుమారుడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీట్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అదే స్కూల్ పక్కన ఓ అపార్ట్ మెంట్ సైతం కొనేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పాడు. ఆ క్రమంలో వివేకా రెండో భార్య ఫ్యామిలీ కొంత మొత్తాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ కూడా చేశారని వెల్లడించారు. అయితే ఈ ప్లాన్ మొత్తం సునీతకు తెలిసి వివేకాను హత్య చేయించిందని ముందస్తు బెయిల్ పిటిషన్లో అవినాష్ రెడ్డి వెల్లడించారు.