అగ్ర హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇటీవల వాల్తేరు వీరయ్యలో దేవి చేసిన సందడి మామూలుగా లేదు. కాకపోతే ఆ సినిమాలో దేవి సంగీతం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఘర్షణలు, మంటలు చెలరేగించి దానితో చలి కాచుకునే లక్షణం బీజేపీకి ఉందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. చెలరేగిన అల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు.
నీచపు పనితో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసి సాగనంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా మరో ఎమ్మెల్యేను సాగనంపే ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. ఏకంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచడం కలకలం రేపింది.
ఈ సినిమా ఇంటిల్లిపాదినీ అలరిస్తోంది. ఈ సినిమాను పలు గ్రామాల్లో రచ్చబండ వద్ద గ్రామస్తులంతా కలిసి వీక్షిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 గ్రామాల్లో ఈ సినిమాను బహిరంగ ప్రదర్శన చేశారు. సినిమా చూస్తూ పల్లె ప్రజలు కన్నీళ్లు పెట్టిన వీడియోలు వైరల్ గా మారాయి.
కష్టాల్లో ఉన్న జట్టుకు తిలక్ వర్మ చేసిన పోరాటం వృథాగా మారింది. కాగా గత సీజన్ లో ముంబై పేలవ ప్రదర్శన ఈ సీజన్ లోనూ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. మరి లోటుపాట్లు సరిదిద్దుకుని గతానికన్నా కాస్త మెరుగయ్యామని నిరూపిస్తారో లేదో వేచి చూడాలి.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు(Rajasthan Royals)..సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు(Sunrisers Hyderabad)పై ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 8 వికెట్ల నష్టానికి 131 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని(perni nani) సవాల్ విసిరారు. అంతేకాదు ధైర్యముంటే పులివెందుల(Pulivendula)లో సీఎం జగన్(cm jagan)కు పోటీగా పవన్(pawan kalyan) లేదా చంద్రబాబు(chandrababu naidu) పోటీ చేయాలని సవాల్ చేశారు.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna)-విజయ్(vijay)తో విడిపోయి.. బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas)తో డేటింగ్(dating) చేస్తున్నట్లు నెట్టింట పుకార్లు వస్తున్నాయి. ముంబయి విమానాశ్రయంలో ఇటీవల వీరిద్దరు జంటగా కనిపించారని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు రష్మిక, శ్రీనివాస్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారని.. ఇటీవల తరచుగా కలుస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ నిజమో కాదో తెలియ...
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే BRS, కాంగ్రెస్ పార్టీలు కలిసే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(bandi sanjay) అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు రెండు సార్లు అధికారం ఇస్తే కేసీఆర్(KCR) రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా చేశాడని సంజయ్ ఆరోపించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Ketireddy Venkatarami Reddy)పై హాట్ కామెంట్స్ చేశారు. కేతిరెడ్డి ఎర్రగుట్ట భూములను ఆక్రమించారని ఆరోపించారు. 902, 909 సర్వే నంబర్లలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి ఫామ్‌హౌస్ కట్టించుకుని ప్రజలకు నీతులు చెబుతున్నారని కేతిరెడ్డిపై లోకేష్ మండిపడ్డారు.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలు(Vande Bharat Train)ను ఏప్రిల్ 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
న్యాచురల్ స్టార్ హీరో నాని(nani) దసరా మూవీ 100 కోట్ల సక్సెస్ వేడుకల్లో పాల్గొనకముందే రేపు గోవాలో నాని 30వ(#nani30) చిత్రం షూటింగ్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ గోవాలో చాలా సుదీర్ఘమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇది రాబోయే 40 రోజుల పాటు కొనసాగుతుందని సమాచారం.
హైదరాబాద్‌లో 24 గంటలు డాగ్ స్క్వాడ్ అందుబాటులో ఉంటారని మేయర్ గద్వాల విజయలక్ష్మీ ప్రకటించారు.
ఏపీ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటి రామారావు(KTR) ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ(letter) రాసి డిమాండ్ చేశారు. పలు కార్పొరేట్లకు రూ. 12.5 లక్షల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు ఉదారంగా వ్యవహరించడం లేదని ప్రశ్నించారు.
ప్రధాని మోడీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. దేశంలో నిరుద్యోగిత రేటు 7.8 శాతంగా ఉందని.. 3 నెలల గరిష్ట స్థాయికి చేరిందని చెప్పారు.