Rahul gandhi: BRSతో పొత్తు… క్లారిటీ ఇచ్చిన రాహుల్ గాంధీ
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఎన్నికల పొత్తు ఉండదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul gandhi) సోమవారం పునరుద్ఘాటించారు. ఢిల్లీ నుంచి బీదర్ మార్గమధ్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనను కలిసిన టీపీసీసీ నేతలకు గాంధీ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందా..? ఈ ప్రచారం కూడా తెలంగాణలో కొంత కాలం జరిగింది. అయితే.. ఈ ప్రచారం పై తాజాగా రాహుల్ గాంధీ(Rahul gandhi) స్పందించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళుతున్న సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ నేతలతో అరగంట పాటు చర్చించారు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ సమయం కేటాయిస్తానని, తెలంగాణ పై ఫోకస్ చేస్తానని టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్(BRS)తో పొత్తుపై స్పందించిన రాహుల్ గాంధీ నేడు తెలంగాణ ప్రాంత నేతలతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండబోదని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.