భారత్ లో తొలి యాపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభమైంది (India’s first Apple Store). ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో యాపిల్ బీకేసీ (Apple BKC) పేరుతో ఈ స్టోర్ ను ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్ లోని రిలయన్స్ జియో వరల్డ్ డ్రైవ్ మాల్ లో (reliance jio world drive mall) ఏర్పాటు చేశారు. 20,800 చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ లో (apple store) వినియోగదారులు అన్ని యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇతర సేవలు కూడా పొందవచ్చును. కంపెనీ సీఈవో టిమ్ కుక్ (tim cook) స్వయంగా తలుపులు తెరిచి కస్టమర్లను స్టోర్ లోకి ఆహ్వానించారు. యాపిల్ ప్రారంభం నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడకు జనాలు తరలి వచ్చారు. చాలామంది సెల్ఫీలు తీసుకున్నారు. గంటల తరబడి వేచి చూశారు. టిమ్ కుక్ స్టోర్ గేట్లను తెరిచారు (Tim Cook Welcomes Customers). స్టోర్ ను ప్రారంభించాక ముంబై ఇన్క్రెడిబుల్… ముంబైలో శక్తి, సృజనాత్మకత, అభిరుచి అపురూపంగా ఉన్నాయి… యాపిల్ బీకేసితో మొదటి స్టోర్ ను తెరిచినందుకు ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు టిమ్ కుక్. ఈ స్టోర్ ప్రారంభోత్సవం కోసం ఆయన సోమవారం ముంబైకి వచ్చారు. సాయంత్రం మాధురీ దీక్షిత్ తో కలిసి ముంబైలో వడాపావ్ ఆరగించారు. భారత్ లో యాపిల్ ను వేగంగా విస్తరించేందుకు రిటైల్ స్టోర్స్ ను ఓపెన్ చేస్తున్నారు. రెండో స్టోర్ యాపిల్ సాకేత్ ను ఢిల్లీలో గురువారం ఓపెన్ చేయనున్నారు.
యాపిల్ కు ప్రపంచవ్యాప్తంగా 500 స్టోర్స్ ఉన్నాయి. భారత్ లో విస్తరణ అవకాశాలు ఉండటంతో దీనిపై టిమ్ కుక్ దృష్టి సారించారు. అంతేకాదు, తన తయారీని చైనా నుండి భారత్ కు మారుస్తోంది యాపిల్. తయారీని ఇక్కడకు మార్చడం, స్టోర్స్ ను అందుబాటులోకి తీసుకు రావడం వంటి వివిధ అంశాల నేపథ్యంలో విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రీమియర్ స్మార్ట్ ఫోన్ విక్రయాలలో యాపిల్ వాటా 40 శాతం. శాంసంగ్, వన్ ప్లస్ కంటే ఎక్కువ. అలాగే, యాపిల్ ఉత్పత్తులు మూడు శాతం భారత్ లో తయారవుతున్నాయి. వచ్చే కొద్ది రోజుల్లో వీటిని ఐదు శాతానికి పెంచనున్నారు. భారత్ లో ఇప్పటికే ఫాక్స్ కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ ఐఫోన్లను తయారు చేస్తున్నాయి. ఫాక్స్ కాన్ త్వరలో ఎయిర్ పోడ్స్, ఐపోడ్స్ ను కూడా తయారు చేయనుంది.