దయాగుణుడైన ఎండీ మహిళ చెప్పినట్టు చేశాడు. జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఆన్ లైన్ లో ఆ మహిళ ఏకంగా రూ.6.69 కోట్లు వసూలు చేసింది.
ఐపీఎల్ లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో భారత ఆటగాడిగా, ఏడో ఇంటర్నేషనల్ ఆటగాడిగా నిలిచాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.
దేశాన్ని సర్వనాశనం చేస్తున్న నరేంద్ర మోదీని సాగనంపేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని తరిమికొట్టేందుకు పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పదేళ్లలో కనిపించని అరుదైన దృశ్యం నేడు కనిపించింది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతలతో కలుస్తూ, పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం మురళీధర రావుతో భేటీ అనంతరం పవన్ ను మీడియా ప్రశ్నించగా.. ఇంకా పలువురు నేతలను కలవాల్సి ఉందని, అందరినీ కలిశాక మాట్లాడుతానని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఆసరా నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు ఎవరూ చంద్రబాబుకు ఓటేయరని చెప్పారు.
తాజాగా, ఓ యువజంట ఏకంగా మెట్రో రైలులోనే ముద్దులు పెట్టుకున్న వీడియో వెలుగు చూసింది. ఈ వీడియో ఒక నిమిషం రెండు సెకన్లు ఉన్నది.
పదో తరగతి తెలుగు పరీక్ష పేపర్ లీకేజీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో లీకేజీల పండగ జరుగుతోందని మండిపడ్డారు.
తాను తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి ఎప్పుడో మరిచిపోయానని టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు
పెళ్లైన రెండు రోజులకే వరుడు ఆకస్మాత్తుగా మరణించాడు. అయితే తనకు వచ్చిన హోం థియేటర్(home theater) పేలిన(blast) క్రమంలో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వరుడితోపాటు అతని బంధువు కూడా ఒకరు మృతి చెందగా, ఇంకో ఏడుగురికి గాయలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్(chhattisgarh)లోని రెంగాఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమరి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు కొశ్చన్ పేపర్ లీకయ్యింది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్ఎస్‌యూఐ ఏకంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
దేశంలో(india) కొత్తగా 3,641 కరోనా కేసులు(corona cases) నమోదు కాగా..మరో 11 మంది ఈ వ్యాధి కారణంగా మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 20,219కు పెరిగింది. ఈ క్రమంలో రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 6.12 శాతం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తుకు వెళ్లేది లేదని వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
జార్ఖండ్‌లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఐదుగురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మావోయిస్ట కీలక నేతలు ఉన్నారు. వీరి తలపై రూ.25 లక్షల చొప్పున రికార్డు ఉంది.
వికారాబాద్ జిల్లా తాండూరులో ఈరోజు 10వ తరగతి పరీక్షలు(10th question paper leaked) మొదలైన ఏడు నిమిషాలకై ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అక్కడి కలెక్టర్ నారాయణ రెడ్డి(narayana reddy) ప్రకటించారు. ప్రశ్నపత్రం లీక్ చేయడంలో ఉపాధ్యాయుడు బందెప్ప పాత్ర ఉన్నట్లు పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు.
మీరు పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank) కస్టమరా... అయితే ఈ అలర్ట్ (PNB Customers Alert) మీ కోసమే. బ్యాంకు ఖాతాలో సఫిసియెంట్ బ్యాలెన్స్ లేకుండానే మీరు ఉపసంహరించుకునే ప్రయత్నాలు చేస్తే ఫెయిల్ అవుతుంది.