»Janasena Leader Venkata Mahesh Questions Perni Nani Ap Politics
Venkata Mahesh: పవన్ ఏం మాట్లాడారో పేర్ని నానికి అసలు అర్థమైందా..? జనసేన నేత
తెలంగాణ మంత్రి హరీష్ రావు మాటలు.. ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపింది. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకోవడంతో.. అందరూ పవన్ పై విమర్శించడం మొదలుపెట్టారు. పవన్ ఏపీ మంత్రులకు వార్నింగ్ ఇవ్వడంతో.. వైఎస్సార్సీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో... ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి జనసేన నేతలు(venkata mahesh) కూడా రెడీ అవుతుండటం విశేషం.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని పై జనసేన ఏపీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్(venkata mahesh) విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ మంత్రి హరీష్రావు మాట్లాడిన మాటలకు జగన్ కు, మంత్రులకు పౌరుషం రావడంలేదా? ఏపీలో అవకాశాలు లేవని చెబితే సిగ్గు అనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.
ప్రజలను కించపర్చవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారని, అన్నారు. పేర్ని నాని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. పేర్ని నానికి పిచ్చి బాగా ముదిరిందని, అజ్ఞానం ఎక్కువైందని, కేవలం తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ గుడ్డిగా చదువుడే ఆయన పనిగా మారిందని విమర్శించారు. కనీసం సిదిరి అప్పలరాజు మాట్లాడిన మాటలు పాలేరు పేర్ని నానికి వినపడలేదా అని ప్రశ్నించారు.
తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై పేర్ని నాని, అప్పలరాజు, బొత్స, కారుమూరు వంటివారు గట్టిగా మాట్లాడేందుకు వణికిపోతున్నారని, బీఆర్ఎస్పై విమర్శలు చేస్తే లోటస్ పాండ్ కూలిపోతుందనే భయమా? లేక మీ వ్యాపారాలు హైదరాబాద్లో ఉండవనా? అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించడం కాదని, మీకు దమ్ముంటే హరీష్ రావు వ్యాఖ్యలుకు గట్టిగా కౌంటర్ ఇవ్వండన్నారు.