ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్జెంటుగా సీఎం సీట్లో చంద్రబాబును కూర్చోబెట్టాలని చూస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వివేకా హత్య కేసుపై సీబీఐ హడావిడి చేస్తుందని ఆరోపించారు. అంతేకాదు ఈ కేసు అప్పుడే పూర్తైనట్లు స్టేట్ మెంట్లు కూడా ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో సీబీఐ వాడుతున్న పదాలు, మాటలు చూస్తుంటే టీడీపీ పొలికల్ ప్లాన్ అని అర్థమవుతుందని సజ్జల అన్నారు. రాబోయే ఎన్నికల కోసమే కథను సిద్ధం చేసుకున్నట్లు అనిపిస్తుందని సజ్జల పేర్కొన్నారు. ఆ దిశగా కథలను నిజంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
జగన్ ను ఎలా ఎదుర్కొవాలో తెలియకే ఈ నాటకాలు ఆడుతున్నారని సజ్జల ఆరోపించారు. మరోవైపు ప్రజలకు ఏమి చేశామో చెప్పుకునేందుకు టీడీపీకి ఏమి దొరకడం లేదని దుయ్యబట్టారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఇంత నీచ స్థాయికి దిగ జారిందని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పై కూడా ఇలానే చేశారని…. వివేకా కేసును ఎజెండాలో భాగంగానే… టీడీపీ వాడుకుంటుందంటూ మండిపడ్డారు.