కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాండ్యాలో జరిగిన ర్యాలీలో శివకుమార్ రూ.500 నోట్ల నగదు విసిరిన సంగతి తెలిసిందే. మాండ్యా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సిక్కిం(Sikkim)లోని నాథులా(nathula phas) సరిహద్దులో భారీ హిమపాతం ఆకస్మాత్తుగా కూలింది. ఈ క్రమంలో ఏడుగురు పర్యాటకులు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మరోవైపు బాధిత ప్రాంతంలో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో తెలంగాణ హైకోర్టు ఏపీ సీఐడీకి కీలక ఆదేశాలు జారీచేసింది. మార్గదర్శికి చెందిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) రాజకీయాల్లోకి వస్తాడని(political entry) పుకార్లు వచ్చిన నేపథ్యంలో వాటిపై ఆయన తాజాగా స్పందించారు. ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని దిల్ రాజు స్పష్టం చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరిని సీబీఐ అఫ్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేశాడు.
టాలీవుడ్ స్టారో హీరో నాగ చైతన్య(Naga Chaitanya) గురించి యంగ్ హీరోయిన్ దక్ష నాగార్కర్(Daksha Nagarkar) కీలక అంశాలను వెల్లడించింది. బంగార్రాజు చిత్రంలో షూటింగ్లో భాగంగా లిప్, హగ్ సీన్స్ చేసిన తర్వాత చైతన్య తనకు క్షమాపణ చెప్పాడని తెలిపింది. అతను చాలా జెంటిల్ మాన్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వైఎస్ షర్మిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. బీజేపీకి బీ టీమ్‌లో వైసీపీ పనిచేస్తుందని షర్మిలతో వీరభద్రం అనగా.. అదేం లేదని ఆమె చెప్పారు.
ఈరోజు వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ ఘటనపై వరంగల్ సీపీ రంగనాథ్(Warangal CP Ranganath) రియాక్ట్ అయ్యారు. ప్రశ్నపత్రం గంటన్నర తర్వాత వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఆ క్రమంలో అది పేపర్ లీక్ అయినట్లు కాదన్నారు.
పదవులకు, చదువుకు సంబంధం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టంచేశారు. ఏ పని లేనివారే మోడీ చదువు గురించి చర్చ చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో గొప్ప నేతగా మోడీకి పేరుందని గుర్తుచేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) తన క్రేజీ వీడియోను ఒకటి ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. రైడ్ టూ వర్క్ ఇన్ కేరళ అని తెలుపుతూ ప్రకటించారు. ఇది చూసిన విజయ్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. రౌడీ ఫెల్లో మూవీ త్వరలో రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాన్ఫరెన్స్ హాల్ లో సిబ్బంది సినిమా పాటలకు డ్యాన్స్ లు చేస్తూ రచ్చరచ్చ చేశారు. క్లబ్ లు.. పబ్ ల్లో మాదిరి స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రికార్డింగ్ డ్యాన్స్ లు మాదిరి చేయడం తీవ్ర దుమారం రేపుతున్నది.
అత్యంత ఎత్తయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్ లోని కొత్త సచివాలయం సమీపంలో 125 అడుగుల ఎత్తులో విగ్రహం నిర్మించడంపై దళిత వర్గాలు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాయి.
డబ్బులు తీసుకున్న వారికి సంస్కారం లేకుంటే ఎలా అంటూ డ్వాక్రా మహిళల పైన ఒకింత అసహనం వ్యక్తం చేసారు మంత్రి ధర్మాన ప్రసాద రావు.
వల్లభనేని వంశీ, కొడాలి నాని పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. ఇదే వల్లభనేని వంశీ స్పందించారు. నాని, తాను పార్టీ మారడం లేదని తేల్చిచెప్పారు.
కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ హీరోగా యాక్ట్ చేస్తున్న చిత్రం మిషన్: చాప్టర్ 1. దీనిని తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రొమోలో నటీనటుల పనితీరును గమనించవచ్చు.