దగ్గుబాటి బాబాయ్, అబ్బయి.. వెంకటేష్, రానా ఫస్ట్ ఫుల్ లెంగ్త్‌లో కలిసి నటించిన వెబ్ సిరీస్త(web series) రానా నాయుడు(Rana Naidu). అయితే ఈ సిరీస్.. ఇప్పటి వరకు దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ అంతా డ్యామేజ్ చేసేంది. అయినా కూడా రానా నాయుడు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. సీజన్ వన్‌తో చేసిన దానికంటే.. డబుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
Rana Naidu is the only Indian title listed in the top 400 worldwide on Netflix
రానా నాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్(web series)లో వెంకటేష్(venkatesh), రానా(rana) బోల్డ్నెస్ చూసి అంతా షాక్ అయ్యారు. అసలు వీళ్లు మన తెలుగు హీరోలేనా? అనే సందేహం రాక మానదు. సీజన్ వన్ స్టార్టింగ్ ఎపిసొడ్లు అయితే.. బ్లూ ఫిల్మ్‌లా ఉందనే టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో ఈ సిరీస్‌ను ఆపేయాలని అన్నారు. అయితే ఒక్కసారి వెబ్ సిరీస్‌కు కమిట్ అయితే.. హీరోలు ఏదైనా చేయాల్సిందే. అలా ఉంటుంది మరి ఓటిటి సంస్థల అగ్రిమెంట్స్. అందుకే రానా, వెంకీ ‘రానా నాయుడు’గా బోల్డ్ కంటెంట్ చేశారని చెప్పొచ్చు.
అయితే ఫస్ట్ సీజన్‌తో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న రానా నాయుడుకి.. ఇప్పుడు సెకండ్ సీజన్ రెడీ అవుతోంది. ప్రముఖ ఓటిటి(ott) దగ్గజం నెట్‌ఫ్లిక్స్(netflix) రూపొందించిన ఈ బోల్డ్ వెబ్ సిరీస్‌న్ సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించారు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌కు డివైడ్ టాక్ వచ్చింది. దీంతో సెకండ్ సీజన్ ఉండే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయనుకున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ తగ్గేదేలే అంటున్నారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ వారు సీజన్ 2(season 2) వస్తోంది.. అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
Don’t worry, the Naidus are coming back to sort out all your kiri kiri.. #RanaNaidu season 2 is coming soon! అంటూ.. ఒక చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్(comments) చేస్తున్నారు. తెలుగులో ఈ సిరీస్‌ను రిలీజ్ చేయాలనుకుంటే అడల్ట్ కంటెంట్ తగ్గించాలని.. సీజన్ 1కి మించి ఇది ఉండాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బాబోయ్ ఈ బోల్డ్ సిరీస్ మాకొద్దు.. అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈసారి రానా నాయుడు ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి.