Agent Movie Promotions: సముద్ర తీరాన ఏజెంట్ మూవీ వైల్డ్ ప్రమోషన్స్
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్(akhil akkineni) యాక్ట్ చేసిన చిత్రం ఏంజెంట్ మూవీ(agent movie) ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సరికొత్తగా సముద్రంలోని బోటులో ఈ చిత్ర ప్రమోషన్లను జరిపారు. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
యంగ్ హీరో అఖిల్ అక్కినేని(akhil akkineni) యాక్ట్ చేసిన ఏజెంట్ మూవీ(agent movie) ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ మేకర్స్ ప్రమోషన్స్(Promotions) సరికొత్తగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సముద్ర తీరాన బోటులో ఏజెంట్ మూవీ ప్రమోషన్స్ ను తాజాగా నిర్వహించారు. ఆ క్రమంలో హీరో అఖిల్ గ్రీన్ కలర్ టీషర్ట్, కాటన్ జీన్స్ ధరించిన డ్రెస్సులో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మరోవైపు యాంకర్ ఆడుగుతున్న ప్రశ్నలకు హీరో, హీరోయిన్ సమాధానం చెబుతున్న చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు నిన్న రిలీజ్ అయిన ఏజెంట్ ట్రైలర్(trailer) చూసిన తర్వాత.. ఇదేదో హాలీవుడ్ మూవీలా ఉందే.. అనేలా ఉందనిపించింది. అయితే ట్రైలర్‌ని ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో కట్ చేశారనిపిస్తుంది. లాస్ట్‌లో ఒంటిపై బుల్లెట్స్ దండ వేసుకుని గన్‌తో ఫైరింగ్ చేసే సీన్.. గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దీంతో ప్రస్తుతం ట్రైలర్ వీడియో యూట్యూబ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.
అంతేకాదు అభిమానుల కోసం ఇంత పెద్ద సినిమా చేశామని.. అందరికీ పిచ్చెక్కిపోవాలని హీరో అఖిల్(akhil akkineni) అన్నారు. ఏజెంట్ క్రెడిట్ అంతా దర్శకుడు సురేందర్ రెడ్డి గారికే ఇస్తానని గుర్తు చేశారు. నన్ను ఇలా చూపించాలని ఇమాజిన్ చేసింది ఆయనేనని తెలిపారు. ఏజెంట్ తనకు ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. ఏప్రిల్ 28న థియేటర్లో పిచ్చెక్కిపోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించగా..హిప్ హాప్ తమిళా సంగీతం(music) సమకూర్చారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేశారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.