Akhil: ఏజెంట్ ప్లాప్.. ఫ్యాన్స్ కి అఖిల్ క్షమాపణలు..!
అక్కినేని వారసుడు నటించి ఏజెంట్ సినిమా బోల్తా కొట్టింది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన కష్టం సినిమాలోని ప్రతి సీన్ లోనూ స్పష్టంగా కనపడింది. కానీ లాభం లేకుండా పోయింది.
సినిమాలో కంటెంట్ లేకుండా హీరో ఎంత కష్టపడితే మాత్రం ఏం లాభం ఉంటుంది. ? ఈ సినిమాలోనూ అదే జరిగింది. ఫలితం తొలి రోజే సినిమా నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా ప్లాప్ అయ్యింది డైరెక్టరే స్వయంగా అంగీకరించాడు. తాము మంచి సినిమా అందించలేకపోయామంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తాజాగా అఖిల్ కూడా ఈ సినిమా ప్లాప్ విషయమై స్పందించాడు. “ఏజెంట్ సినిమా తెరకెక్కించడంలో తమ జీవితాలను అంకితం చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. మేము మంచి సినిమాను అందించేందుకు ఎంతో కష్టపడినప్పటికీ దురదృష్టవశాత్తు మేము అనుకున్నదాన్ని స్క్రీన్‌పైకి తీసుకురాలేకపోయాం. ప్రేక్షకుల అంచనాలను అనుగుణంగా మేము ఈ సినిమాను అందించలేకపోయాం. నాకెంతో అండగా నిలిచిన చిత్ర నిర్మాత అనిల్‌కు కృతజ్ఞతలు. మా చిత్రాన్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు, సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఇస్తున్న ప్రేమ వల్లే నేను కష్టపడి వర్క్ చేస్తున్నా. నాపై నమ్మకం పెట్టుకున్న వారి కోసం మరింత బలంగా మారి తిరిగివస్తాను” అంటూ ఓ స్పెషల్ నోట్ షేర్ చేశారు.