Nanis 30: నాని నెక్స్ట్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్?
దసరాతో సాలిడ్ హిట్ కొట్టాడు న్యాచురల్ స్టార్ నాని(nani). ఓ విధంగా చెప్పాలంటే.. దసరా ముందు ఓ లెక్క.. దసరా తర్వాత ఓ లెక్క అనేలా నాని కెరీర్ టర్నింగ్ పాయింట్ తీసుకుందని చెప్పాలి. దసరా మూవీతో ఏకంగా వంద కోట్ల హీరోగా మారిపోయాడు నాని. ఇదే జోష్‌లో నాని 30(nani 30) ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. తాజాగా ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.
ప్రస్తుతం నాని(nani) సినిమాలకు మంచి మార్కెట్ ఉండడంతో.. రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది. ఇక పై ఒక్కో సినిమాకు ఇరవై కోట్లకు పైమాటేనని అంటున్నారు. ఇక దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెలను డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేసిన నాని.. నెక్స్ట్ సినిమాతో మరో టాలెండెట్ డైరెక్టర్‌ను పరిచయం చేయబోతున్నాడు. నాని 30 సినిమాను శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతోంది. ఇప్పటికే తండ్రి కూతుళ్ల(father daughter) అనుబంధంగా ఈ సినిమా రాబోతున్నట్టు ఓ వీడియోతో చెప్పేశారు మేకర్స్. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. దాంతో లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
తండ్రి కూతుళ్ల ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ కావడంతో.. ‘హాయ్ నాన్న’ అనే టైటిల్‌ని ఓకె చేసినట్టు సమాచారం. కథ ప్రకారం ఈ టైటిల్ సినిమాకు పర్ఫెక్ట్ సూట్ అయ్యేలా ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్(mrunal thakur) హీరోయిన్గా నటిస్తోంది.
సీతారామం లాగే తన కెరీర్లో నాని 30 కూడా క్లాసికల్ హిట్‌గా నిలిచిపోతుందనే నమ్మకంతో ఉంది మృణాల్(mrunal thakur). ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి నాని 30 ఎలా ఉంటుందో చూడాలి.