»Hiranya Kasipa Proiect Is Canceled Due To Shakuntalam Disaster
Hiranya kasipa ఇక లేనట్టే..? శాకుంతలం డిజాస్టర్ గుణశేఖర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఎఫెక్ట్
శాకుంతలం మూవీ డిజాస్టర్ దర్శకుడు గుణశేఖర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పడింది. హిరణ్య కశిప మూవీని తెరకెక్కించాలని గుణశేఖర్ భావించగా.. ఆ సినిమాకు ప్రొడ్యూస్ చేసే వారు లేకుండా పోయారు.
Hiranya kasipa proiect is canceled due to shakuntalam disaster
Hiranya kasipa:ఇటీవల వచ్చిన గుణశేఖర్ ‘శాకుంతలం’ (shakuntalam) మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఆ మూవీ ఆడకపోవడంతో గుణశేఖర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపించింది. మరో పాన్ ఇండియా మూవీ ‘హిరణ్య కశిప’ (Hiranya kasipa) తెరకెక్కించాలని గుణశేఖర్ (Gunashekar) భావించారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎప్పటినుంచో చెబుతున్నారు. రానాతో (Rana) చేయాలని అనుకొని.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నాడు. ఇందుకోసం ఐదేళ్లపాటు పనిచేశాడు. కానీ ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదు.
హిరణ్య కశిపను (Hiranya kasipa) సురేష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి పూర్తిచేయాలని తొలుత గుణశేఖర్ (Gunashekar) అనుకున్నారు. మూవీ కోసం రూ.300 కోట్లకు (300 crores) పైగా అవుతుందని అంతకుముందు సురేష్ బాబు (suresh babu) కూడా చెప్పారు. శాకుంతలం మూవీ రిలీజ్ కాకముందు గుణశేఖర్- సురేష్ బాబు మధ్య ఏదో తేడా వచ్చిందట. ఇప్పుడు శాకుంతలం కూడా డిజాస్టర్ అయ్యింది. సో.. హిరణ్య కసిప (Hiranya kasipa) పట్టాలెక్కే వీలు లేకుండా పోయింది.
హిరణ్య కశిప (Hiranya kasipa) తన కథ అని.. ఎవరితో చేస్తాననేది త్వరలో ప్రకటిస్తానని గుణశేఖర్ (Gunashekar) తెలిపారు. ఇప్పుడు గుణశేఖర్‌తో కలిసి వచ్చేవారు లేకుండా పోయారు. రుద్రమదేవి మూవీని గుణశేఖర్ (Gunashekar) సొంతంగా నిర్మించి.. చాలా ఇబ్బందులు పడ్డారు. శాకుంతలం మూవీకి దిల్ రాజు తోడు కావడంతో సినిమా రిలీజ్ అయ్యింది. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇక గుణశేఖర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు కూడా విశ్వసించే సిచుయేషన్ లేదు. మరో నిర్మాత ఎవరూ కూడా వచ్చే ధైర్యం చేయరు.
గుణశేఖర్ (Gunashekar) 1992లో లాఠీ అనే మూవీని తెరకెక్కించారు. తర్వాత సొగసు చూడతరమా, రామాయణం తీశారు. మెగాస్టార్ చిరంజీవితో తీసిన చూడాలని ఉంది మూవీ హిట్ అయ్యింది. మనోహరం సినిమా కూడా హిట్ టాక్ వచ్చింది. మృగరాజు డిజాస్టర్ కాగా.. మహేశ్ బాబుతో చేసిన ఒక్కడు సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. తర్వాత అర్జున్, సైనికుడు వరసగా ప్లాప్ అయ్యాయి. బన్నీతో తీసిన వరుడు కూడ ఆడలేదు. నిప్పు పరిస్థితి కూడా అంతే.. రుద్రమదేవి, శాకుంతలం సినిమాలు కూడా నిరాశ కలిగించాయి.