»Official Pawan Kalyan Og Heroine Fix Priyanka Mohan
OG Heroine: అఫీషియల్.. పవన్ OG హీరోయిన్ ఫిక్స్!
పవన్(Pawan kalyan) ఓజి(OG) మూవీపై గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ అప్టేట్స్ ఇస్తునే ఉన్నారు మేకర్స్. ముందుగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ అయిందని సాలిడ్ వీడియోతో ప్రకటించారు. ఆ తర్వాత పవన్ ముంబైలో అడుగుపెట్టగానే అదిరిపోయే ఫోటో అప్లోడ్ చేశారు. ఆ వెంటనే కొన్ని స్టిల్స్ రిలీజ్ చేశారు. ఆ పైన పవన్ స్టైల్ ఆఫ్ యాక్షన్ మోడ్‌లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేశాడని వీడియోని రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు హీరోయిన్ని అధికారికంగా ప్రకటించారు.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఓజి(OG) మూవీని యంగ్ డైరెక్టర్ సుజీత్(director Sujeeth) తెరకెక్కిస్తున్నాడు. సాహో తర్వాత సుజీత్ చేస్తున్న సినిమా ఇదే. వపన్ కమిట్ అయినా సినిమాల్లో.. హరిహర వీరమల్లు తర్వాత స్ట్రెయిట్ ఫిల్మ్ కూడా ఇదే. అందుకే ఓజి పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే సుజీత్ ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్లో అదిరిపోయే యాక్షన్‌తో ఓజిని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అయితే ఈ పవర్ ఫుల్ గ్యాంగ్ డ్రామాలో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.
కానీ నాని గ్యాంగ్ లీడర్లో నటించిన క్యూట్ బ్యూటీ ప్రియాంకా మోహన్(priyanka mohan) పేరు పరిశీలనలో ఉన్నట్టు వినిపించింది. ఇక ఇప్పుడు అదే నిజం చేస్తూ.. ప్రియాంకను ఫైనల్ చేసినట్టు అఫిషీయల్‌గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రియాంకకు సంబంధించిన ఓ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. దీంతో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌తో రొమాన్స్ చేసే బ్యూటీ ఫైనల్ అయిపోయింది.
అయితే అరకొర ఆఫర్లతోనే నెట్టుకొస్తున్న ప్రియాంక(priyanka mohan).. ఏకంగా పవర్ స్టార్‌తో ఛాన్స్ అందుకోవడం లక్కీ అనే చెప్పాలి. తన కెరీర్‌కు పవర్ స్టార్ బ్రాండ్ మరింత బూస్టింగ్ ఇవ్వనుంది. ప్రస్తుతం ముంబైలో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ల పై కొన్ని కీలక సీన్స్ షూట్ చేస్తున్నారు. ఏదేమైనా అనౌన్స్మెంట్లతోనే ఓజి పై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. మరి ఈ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తాడో చూడాలి.