అమెరికాలోని మైనే రాష్ట్రంలో (Maine, United States) మంగళవారం కాల్పుల జరిగాయి (US mass shooting). బౌడోయిన్ ప్రాంతంలో ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. అనంతరం 295వ నెంబర్ హైవే పైన కూడా పలు వాహనాలపై కాల్పులు చోటు చేసుకున్నాయి. పోర్ట్ ల్యాండ్ – బోడోయిన్ మధ్య ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. రెండు చోట్ల జరిగిన కాల్పులకు సంబంధం ఉందని అధికారులు చెప్పారు. ఈ ఘటనలకు సంబంధించి జోసెఫ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అనంతరం పోలీసులు అంతర్రాష్ట్ర రహదారిని క్లోజ్ చేశారు. అక్కడి వ్యాపారాలు, ఇళ్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఇటీవల టెన్నెస్సీలోని నాస్ విల్లె క్రిస్టియన్ స్కూల్లో కాల్పులు, లూయిస్ విల్లేలోని బ్యాంకులో కాల్పులు అనంతరం ఇప్పుడు మరోసారి కలకలం చోటు చేసుకున్నది. తాజా ఘటనకు సంబంధించి మైనేలోని బౌడోయిన్ పోలీసులు జోసెఫ్ ఈటన్ అనే 34 ఏళ్ల వ్యక్తిపై అభియోగాలు మోపి, అరెస్ట్ చేశారు. అతనిని ఈటన్ కోర్టులో హాజరుపరుస్తారు. ఇంట్లో కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, రోడ్డు మీద కాల్పుల సమయంలో పలువురు గాయపడినట్లు పోలీసులు గుర్తించారు.
మైనే గవర్నర్ జానెట్ మిల్స్ కాల్పుల ఘటనపై స్పందిస్తూ… ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనతో మైనే ప్రజల వలె తాను కూడా షాక్ కు గురయ్యానని, చాలా బాధపడ్డానని చెప్పారు. నేటి ఈ హింస మన రాష్ట్రాన్ని, ప్రజలను కదిలించిందన్నారు.
🚨#BREAKING: A Shooting spree leaves multiple people dead and injured
A tragic event has occurred in Yarmouth Maine this morning resulting in multiple fatalities and injuries in two separate locations . Three people were shot while driving, and four… pic.twitter.com/FxlRriBgUY