సూడాన్ లో ఆర్మీ, పారామిలటరీ యుద్ధం (sudan army vs paramilitary) నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల (indians in Sudan) కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో కర్నాటక కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (congress leader Siddaramaiah) చేసిన వ్యాఖ్యలు… దానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (Minister of External Affairs of India S. Jaishankar) ఇచ్చిన కౌంటర్ చర్చనీయాంశంగా మారింది. సూడాన్ లో (sudan) 31 మంది కర్నాటకకు చెందిన గిరిజనులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా వెనక్కి తీసుకు రావడానికి చర్యలు తీసుకోవాలని సిద్ధరామయ్య ట్వీట్ (siddaramaiah twitter) చేశారు. దీనిపై ఎస్ జైశంకర్ (s jaishankar twitter) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయం చేయడానికి సమయం కాదంటూ గట్టి చురకలు అంటించారు.
సూడాన్ లో చిక్కుకున్న కర్నాటక వాసులు హక్కీ పిక్కీ గిరిజన తెగకు చెందినవారని, కొద్ది రోజులుగా తిండిలేక అలపటిస్తున్న వారిని ఆదుకోవాలని, వారిని వెనక్కి రప్పించే చర్యలను ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదని ప్రధాని మోడీ, పీఎంవో ఇండియా, కేంద్ర హోంశాఖ, కేంద్ర విదేశాంగ శాఖ, కర్నాటక సీఎం బొమ్మైలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కు జైశంకర్ వెంటనే స్పందించారు. మీ ట్వీట్ చూసి ఆశ్చర్యపోయాను… జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి… మీరు రాజకీయాలు చేయవద్దు అంటూ హితవు పలికారు. ఏప్రిల్ 14వ తేదీన సూడాన్ లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, ఖార్టూమ్‌లోని భారత రాయబార కార్యాలయం సూడాన్‌లోని చాలామంది భారతీయ జాతీయులు, PIOలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని గుర్తు చేశారు. మీరు వారి పరిస్థితితని రాజకీయం చేయడం బాధ్యతారాహిత్యం అన్నారు. విదేశాలలో ఉన్న భారతీయులను ప్రమాదంలో పడేయడాన్ని ఏ ఎన్నికల లక్ష్యం సమర్థించదన్నారు. ఆ తర్వాత మరో ట్వీట్ లో మీరు చెబుతున్న వారి వివరాలు, లొకేషన్ ను భద్రతా కారణాల వల్ల బయటకు చెప్పలేమని తెలిపారు. సూడాన్ లో అంతర్యుద్ధం కారణంగా వారు అక్కడే నిలిచిపోయారని చెప్పారు.
Simply appalled at your tweet! There are lives at stake; don’t do politics.
Since the fighting started on April 14th, the Embassy of India in Khartoum has been continuously in touch with most Indian Nationals and PIOs in Sudan. https://t.co/MawnIwStQp