ముంబై(Mumbai)లో వ్యభిచార రాకెట్ నడుపుతోందనే ఆరోపణలపై 27 నటి, కాస్టింగ్ డైరెక్టర్(Casting Director) ఆర్తి మిట్టల్(Aarti Mittal)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని పోలీసులు ఇద్దరు డమ్మీ కస్టమర్లను పంపి ఆర్తి నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. ఉమెన్ కాస్టింగ్ డైరెక్టర్ అయిన ఆర్తి మిట్టల్ పై వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సినిమా అవకాశాల(Cinema Chances) కోసం వచ్చే వారిని టార్గెట్ చేసుకుని వారికి డబ్బులు ఆశ చూపి, అలాగే సినిమా అవకాశాలను ఆశ చూపి ఆర్తి మిట్టల్ దందా నడిపింది.
ఆర్తి మిట్టల్ (Aarti Mittal)పై నిఘా ఉంచిన పోలీసులు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇద్దరు కస్టమర్లను ఆమె దగ్గరికి పంపారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందని నిర్దారణ అయ్యాక దాడులు చేపట్టారు. పోలీసులు చేసిన దాడుల వల్ల ఆర్తి మిట్టల్ నిజ స్వరూపం బయటపడింది. ఈ దాడుల వల్ల ఇద్దరు మోడల్స్(Models)ను పోలీసులు రక్షించి, పునరావాస కేంద్రానికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వీడియా రికార్డు చేశారు. నిందితురాలు ఆర్తి మిట్టల్ (Aarti Mittal)ను అరెస్ట్ చేశారు. ఆర్తి మిట్టల్ గత కొంత కాలంగా కాస్టింగ్ డైరెక్టర్(Casting Director)గా పనిచేస్తున్నారు. ఓషివారాలోని ఆరాధనా అపార్టుమెంటులో ఆర్తి మిట్టల్ నివశిస్తున్నారు. సినిమా ప్రాజెక్టుల పేరుతో ఆమె మోడల్(Models)లను కలిసి వారికి డబ్బులు ఆశలు చూపేవారు. బలవంతంగా వ్యభిచారంలోకి మోడల్స్‌ను దింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆర్తి మిట్టల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 370తో పాటు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి ఇతర సెక్షన్ల ద్వారా పోలీసులు కేసు నమోదు చేశారు.