YS Bhaskar reddy:వైఎస్ వివేకానంద (YS Viveka) హత్య కేసులో భాస్కర్ రెడ్డిని (YS Bhaskar reddy) సీబీఐ అధికారులు (cbi officials) ఈ రోజు విచారించాల్సి ఉంది. భాస్కర్ రెడ్డి (bhaskar reddy), ఉదయ్ కుమార్ రెడ్డిను (uday kumar reddy) సీబీఐకి 6 రోజుల కస్టడీకి హైకోర్టు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 9 గంటలకు విచారించాల్సి ఉండగా.. ఒక్కసారిగా బీపీ (bp) పెరిగింది. వైద్య పరీక్షలు చేసి.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కస్టడీలోకి తీసుకోవాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.
వివేకా (viveka) హత్య కేసులో ఆదివారం అరెస్ట్ చేసి మేజిస్ట్రెట్ ముందు హాజరుపరిచే సమయంలో కూడా భాస్కర్ రెడ్డికి బీపీ (bp) పెరిగింది. ఈ రోజు మరోసారి అలానే అయ్యింది. వివేకా హత్య కేసులో (viveka murder case) భాస్కర్ రెడ్డి ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కేసులో భాస్కర్‌ను (bhaskar) సీబీఐ కుట్రదారుడిగా అభియోగాలు నమోదు చేసింది. వివేకానంద (viveka) గుండెపోటుతో చనిపోయారని ప్రచారం జరిగింది. అలా భాస్కర్ రెడ్డి (Bhaskar reddy) ప్రచారం చేశారని సీబీఐ అధికారులు (cbi) అనుమానిస్తున్నారు. సాక్ష్యాలు చెరిపివేయడంతో కూడా అతని రోల్ ఉందని అధికారులు అంటున్నారు.
భాస్కర్ రెడ్డి (Bhaskar reddy) అనారోగ్యంతో ఉండటంతో.. ఉదయ్ కుమార్ రెడ్డి (uday kumar reddy), అవినాష్ రెడ్డిని (avinash reddy) సీబీఐ అధికారులు (cbi officials) ఈ రోజు ప్రశ్నించే అవకాశం ఉంది. అవినాష్‌కు (avinash) సంబంధించి ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తూ.. విచారించాలని సీబీఐకి హైకోర్టు స్పష్టంచేసింది. ఈ నెల 25వ తేదీ వరకు విచారించాలని.. ఆ రోజు అవినాష్ ముందస్తు బెయిల్‌కు సంబంధింది తుది తీర్పు వెల్లడిస్తామని నిన్న ధర్మాసనం తెలిపింది. అప్పటివరకు అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.