Megastar Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న మొగిలయ్య (Mogilaiah) చికిత్సకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. బుడగ జంగాల కళాకారుడు మొగిలయ్య (Mogilaiah) రెండు కిడ్నీలు (kidneys) పాడయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో డయాలిసిస్ చేస్తున్నారు. గుండెపోటు రావడంతో మొగిలయ్య (Mogilaiah) ఫ్యామిలీ ఆందోళన చెందారు.
మొగిలయ్య (Mogilaiah) ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. సామాజిక వర్గం పరంగా కూడా అండగా నిలిచే పరిస్థితి లేదు. బలగం (balagam) మూవీ నటులు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి (chiranjeevi) ముందుకొచ్చారు. ఆయన కంటిచూపు చికిత్సకు ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు. ఎంత ఖర్చయినా సరే తనే భరిస్తానని తెలిపారు. బలగం దర్శకుడు వేణుకు (venu) మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. అతనికి అండగా ఉంటానని.. కంటి చూపు చికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు.
బలగం (balagam) సినిమా అన్నీ వర్గాలను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. గ్రామాల్లో సినిమాను (cinema) కూడా ప్రదర్శిస్తున్నారు. విడిపోయిన కుటుంబాలు కూడా ఒక్కటి అవుతున్నాయి. మూవీలో చివర మొగిలయ్య (mogilaiah) పాడిన పాట హృదయానికి హత్తుకుంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని డైరెక్టర్ చక్కగా చూపించారు.