»After Virat Kohli Action In Instagram Ganguly Also Unfollowed Kohli
Ganguly: విరాట్ ఇన్ స్టాలో చర్య తర్వాత..కోహ్లీని అన్‌ఫాలో చేసిన గంగూలీ
ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లి(Virat kohli), సౌరవ్ గంగూలీ(Ganguly)ని అన్‌ఫాలో చేసిన తర్వాత, దాదా ఖచ్చితమైన ప్రతిస్పందనతో రిప్లై ఇచ్చాడు. టీమిండియా మాజీ కెప్టెన్లిద్దరి మధ్య తాజాగా జరిగిన మ్యారెట్ ఎంటో ఇప్పుడు చుద్దాం.
సౌరవ్ గంగూలీ(Ganguly), విరాట్ కోహ్లీ(Virat kohli) మధ్య విభేధాలు ఉన్నట్లు ఇది వరకే తెలుసు. అయితే గత శనివారం (ఏప్రిల్ 15) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరిగిన IPL మ్యాచులో వీరిద్దరి మధ్య ఓ సంఘటన చోటుచేసుకుంది. కోహ్లీ, గంగూలీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యింది. అయితే ఆ వీడియోలో విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత అందరికీ షేక్ హ్యండ్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ క్రమంలో గంగూలీ రాగానే అతను పక్కకు తప్పుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. దీంతో విరాట్ అతన్ని గమనించి తర్వాత వ్యక్తి దగ్గరకు వెళ్లాడు.
అయితే ఈ సంఘటన తర్వాత కోహ్లీ ఏప్రిల్ 16న తన ఇన్ స్టా ఖాతాలో గంగూలీ( Ganguly)ని అన్ ఫాలో చేశారు. ఇక అది తెలుసుకున్న సౌరవ్ గంగూలీ కూడా ఏప్రిల్ 18న ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీని అన్ఫా(unfollowed)లో చేశారు. అయితే వీరిద్దరి మధ్య వివాదం విరాట్ కోహ్లి తన T20 కెప్టెన్సీని వదులుకున్నప్పటి నుంచి మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయని మరోసారి తేటతెల్లమైంది.
విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అనుసరించడం లేదని సోషల్ మీడియా వినియోగదారులు గుర్తించారు. ఐపీఎల్ మ్యాచ్ తర్వాత కోహ్లి గంగూలీని అన్‌ఫాలో చేశాడని వార్తలు వచ్చిన తర్వాత, ఇప్పుడు గంగూలీ కూడా కోహ్లీని అనుసరించడం లేదని గమనించారు.
అక్టోబర్ 2021లో కోహ్లి భారత T20I కెప్టెన్‌గా వైదొలిగిన తర్వాత, అతను ODI కెప్టెన్‌గా కూడా తొలగించబడ్డాడు. అయితే అప్పుడు బీసీసీఐ బోర్డు నిర్ణయం ఛైర్మన్ గా ఉన్న గంగూలీకి ఈ విషయం తనకు కొన్ని గంటల ముందే తెలిసిందని చెప్పడంతో అసలు వివాదం మొదలైంది. మరోవైపు తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ ఎలాంటి తప్పు చేయలేదని, చర్చల ప్రక్రియ ద్వారానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.