»Rahul Gandhi Who Ate Chaat Golgappa And Drink Sharbat At Old Delhi
Rahul Gandhi: చాట్ గోల్ గప్పా తిని, షర్బత్ తాగిన రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మంగళవారం రాత్రి ఓల్డ్ ఢిల్లీ(old delhi)లో పర్యటించారు. ఆ క్రమంలో బెంగాలీ మార్కెట్ సహా వివిధ ప్రాంతాలను సందర్శించి ప్రసిద్ధ వంటకాలను స్వయంగా తిన్నారు. దీంతో స్థానిక ప్రజలు రాహుల్ తో ఫొటోలు దిగేందుకు పెద్ద ఎత్తున గుమిగూడారు.
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ(Rahul Gandhi)మంగళవారం రాత్రి అలా సరదాగా ఢిల్లీ(delhi) వీధుల్లో పర్యటించి ప్రజలతో ముచ్చటించారు. ఆ నేపథ్యంలో బెంగాలీ మార్కెట్, చాందినీ చౌక్ మార్కెట్లో రాహుల్ గోల్గప్పే, చాట్(chaat golgappa), షర్బత్ వంటకాలను తిని ఆస్వాదించారు. రంజాన్ ఉత్సవాల సందర్భంగా ఆ వీధుల్లో నోరూరించే రుచికరమైన వంటకాలు, చల్లగా ఉండే పానీయాలను స్వీకరించారు.
అతను ‘మొహబ్బత్ కా షర్బత్(sharbat)’ స్టాల్లో పుచ్చకాయ ఆధారిత పానీయాన్ని స్వీకరించారు. కబాబ్‌లను ప్రయత్నించడానికి నేరుగా అల్ జవహర్ రెస్టారెంట్‌కి వెళ్లాడు. అంతేకాదు ఆయనతో పాటు ఫుడ్ రైటర్, బ్లాగర్ కునాల్ విజయ్కర్ కూడా ఉన్నారు.
చాలా రోజుల తర్వాత రాహుల్ గాంధీ తెల్లటి టీ షర్ట్ కాకుండా నీలిరంగు టీషర్ట్(blu colour t shirt)లో కనిపించారు. ఆ క్రమంలో స్థానిక ప్రజలు రాహుల్ ను చూసేందుకు, అతనితో సెల్ఫీ దిగేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మార్కెట్లో రాహుల్ గాంధీని తన అంగరక్షకులు చుట్టుముట్టారు.
అంతకుముందు మే 10న ఎన్నికలు జరగనున్న కర్ణాటక(Karnataka)లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) పాల్గొన్నారు. 50% రిజర్వేషన్ల పరిమితిని తొలగించాలని పిలుపునిచ్చారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెరవేరుస్తామని స్పష్టం చేశారు. 2019 పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు అతనికి శిక్ష విధించడంతో ఇటీవల రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.