Chattisgarh : కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై నక్సలైట్ల కాల్పులు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపి కలకలం రేపారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మందవి (Congress MLA Vikram Mandavi) ఓ బహిరంగ సభలో పాల్గొని తిరిగి వెళ్తున్నారు. బీజాపూర్ మీదుగా ఆయన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు.
చత్తీస్గడ్(Chattisgarh)లో నక్సలైట్ల మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మాండవి (MLA Mandavi) ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై కాల్పులు జరిపారు. మంగళవారం బీజాపూర్ (Bijapur) లో జరిగిన ఓ బహిరంగ సభకు హాజరైన ఎమ్మెల్యే పంచాయతీ సభ్యురాలు పార్వతి కశ్యప్‌తో కలిసి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.కాగా ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు (Maoists) తరచూ ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నేతలను టార్గెట్ చేస్తున్నారు. 2019లో దంతెవాడ (Dantewada) ప్రాంతంలో మావోయిస్టులు బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి కాన్వాయ్ పై దాడి చేయగా ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. లోక్ సభ మొదటి దశ ఎన్నికలకు రెండు రోజుల ముందు ఈ ఘటన జరగడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా మరోసారి మావోయిస్టులు అధికార పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ గా చేసుకోవడం సంచలనంగా మారింది.ఛత్తీస్‌గఢ్ లో ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు కాల్పులకు తెగబడుతున్న ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. 2019 ఎన్నికలను బహిష్కరించాలంటూ అప్పట్లో మావోయిస్టులు (Maoists) పిలుపునిచ్చారు. స్థానికులు ఎవరూ ఓట్లు వేయొద్దని నక్సలైట్ల చెప్పారు. అయినప్పటికీ బస్తర్ లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఎన్నికలు జరిగిన రెండు రోజులకే దంతెవాడలో బీజేపీ ఎమ్మెల్యే భీమా (BJP MLA Bhima) మందవిని మావోయిస్టులు చంపేశారు.