NZB: ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ అధికారి, సిబ్బందితో ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మాదకద్రవ్యాలు, ఇతర చట్ట విరుద్ధ పదార్థాలను గుర్తించడానికి శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్ సహాయంతో ఈ ఆపరేషన్ జరిగిందన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, లగేజీపై తనిఖీలు జరిగాయన్నారు. పెద్దగా ఎటువంటి రికవరీ కాలేదన్నారు.