రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (royal challengers bangalore) జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి (rcb capitain virat kohli) భారీ జరిమానా పడింది. చెన్నై సూపర్ కింగ్స్ తో (chennai super kings) జరిగిన మ్యాచ్ లో నిబంధనలు ఉల్లంఘించారంటూ కోడ్ ఆఫ్ కండక్ట్ (Code of Conduct) కింద మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించారు. ‘ఐపీఎల్ 2023లో (ipl 2023) చెన్నై సూపర్ కింగ్స్ తో (chennai super kings) బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో మ్యాచ్ సమయంలో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించినందుకు ఆర్సీబీ జట్టు బ్యాటర్ విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పెడుతున్నాం. మిస్టర్ కోహ్లీ ఐపీఎల్ కోడ్ లోని ఆర్టికల్ 2.2లోని లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించారు’ అంటూ బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. కోహ్లీకి ఏ సంఘటన ఆధారంగా జరిమానా విధించారనే అంశం స్పష్టంగా తెలియనప్పటికీ చెన్నై ఆటగాడు శివం దుబే ఔట్ అయిన సమయంలో కోహ్లీ వ్యవహరించిన తీరు ఇందుకు కారణంగా తెలుస్తోంది. 26 బంతుల్లో 52 పరుగులతో మెరిసిన దుబే.. పార్నెల్ బౌలింగ్ లో సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ సమయంలో కోహ్లీ ఆనందోత్సవాలు కాస్త శృతి మించినట్లుగా కనిపించింది. దూకుడుగా వ్యవహరించిన కారణంగా పైన్ పడినట్లుగా తెలుస్తోంది.
చెన్నై – బెంగళూరు మధ్య జరిగిన పోరులో చెన్నై గెలిచినప్పటికీ… భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్ లో మొత్తం 444 పరుగులు నమోదయ్యాయి. ఇటీవల చెన్నై – రాజస్థాన్ మ్యాచ్ లో చివరి ఓవర్ కు జియో సినిమాలో 2.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు చెన్నై – బెంగళూరు చివరి ఓవర్ కు 2.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డ్. ఈ మ్యాచ్ లో ధోనీ చివరి ఓవర్ లో రెండు బంతులు ఉండగా క్రీజులోకి వచ్చాడు. ధోనీ పవర్ హిట్టింగ్ చూడటానికి అభిమానులు ఆసక్తి చూపారు. అందుకే ధోనీ కంటే ముందు 1.8 కోట్లుగా ఉన్న వ్యూయర్స్.. ఆయన రాగానే 2.2 కోట్లకు చేరుకున్నది. నిన్నటి మ్యాచ్ లో చెన్నై 8 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది.