హర్యానాలోని కర్నాల్ జిల్లాలో మంగళవారం మూడు అంతస్తుల రైస్ మిల్లు భవనం కుప్పకూలడంతో పలువురు రైస్ మిల్లు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 4గురు వర్కర్లు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయాలైనట్లుగా తెలుస్తోంది. నివేదికల ప్రకారం వందల మంది కార్మికులు భవనం లోపల నిద్రపోయేవారు. డీసీ కర్నాల్ అనీష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ… వర్కర్లలో 24 మంది గాయపడ్డారని, నలుగురు మరణించినట్లు చెప్పారు. ఘటన జరిగినప్పుడు భవనంలో దాదాపు 150 మంది కార్మికులు ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. భవనంలో కొన్ని లోపాలు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించామని, ఘటనపై విచారణకు కమిటీ వేస్తామని, రైస్ మిల్లు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.
ప్రమాదం ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే అగ్నిమాపక దళం, అంబులెన్స్, పోలీసులు అందరూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి శిథిలాల కింద ఎవరూ కనిపించడం లేదని, తాము కార్మికుల జాబితాను క్రాస్ చెక్ చేశామని కర్నాల్ ఎస్పీ శశాంక్ కుమార్ తెలిపారు.
#WATCH | Haryana: Several rice mill workers feared being trapped under debris after a three-storeyed rice mill building collapsed in Karnal. Workers used to sleep inside the building. Fire brigade, police and ambulance have reached the spot. Rescue operations underway. pic.twitter.com/AFzN9HDPYw