మరికొన్ని గంటల్లో రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తున్నారు. ఇంతలో హైదరాబాద్‌లో మరో భారీ ప్లెక్సీ వెలిసింది. మోడీ కుటుంబం స్వాగతం చెబుతోంది అని పైన రాసి ఉంది. అందులో రాజకీయ నేతలు తండ్రులు/ కుమారులు- కుమార్తెలు ఉన్నారు.
ఐపీఎల్ రెండో మ్యాచ్‌లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ టీమ్ 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలిగారు. లక్నో సూపర్ జెయింట్ ముందు 122 పరుగుల లక్ష్యం ఉంచారు.
పదో తరగతి హిందీ పేపర్ లీక్ జరిగడానికి కారణమైన స్టూడెంట్‌ను డిబార్ చేశారు. ఐదేళ్లపాటు పరీక్ష రాసేందుకు వీలులేదని డీఈవో స్పష్టంచేశారు. దీంతో బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. తన తప్పు ఏం లేదని చెబుతున్నాడు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ గురించి మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. తన తమ్ముడు చంద్రశేఖర్ క్రాస్ ఓటింగ్ చేయడం తప్పేనన్నారు.
సెలబ్రిటీ కపుల్ ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ డైవర్స్ తీసుకుంటున్నారని మరోసారి చర్చకు వచ్చింది. గతంలో కూడా రూమర్స్ రాగా.. వాటిని ఇద్దరూ కొట్టిపారేశారు. ఇప్పుడు మరోసారి రూమర్స్ వస్తున్నాయి.
ఏపీ(ap)లో గత నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని జగన్(jagan) అంటూ...చంద్రబాబు(Chandrababu naidu) ఆయనకు సెల్ఫీ సవాల్(selfie challenge) చేశారు. మీరు చెప్పిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? సమాధానం చెప్తారా అంటూ ప్రశ్నించారు. నెల్లూరులో టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ దిగిన క్రమంలో ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేసి డిమాండ్ చేశారు.
సినీ నటి ఖుష్బు ప్లూతో బాధపడుతున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు.
తెలంగాణలో BRS పార్టీకి ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చేందుకు బీజేపీ(BJP) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల బెయిల్ పై విడుదలైన బండి సంజయ్(bandi sanjay)కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఈ మేరకు ఫోన్ చేసి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటీ? అది కేసీఆర్, BRS పార్టీపై ఎలా ప్రభావం చూపుతుందని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు స్టార్ క్యాంపెయినర్ల కోసం చూస్తున్నాయి. కేజీఎఫ్ ఫేమ్ యష్ ప్రచారం కోసం రాజకీయ పార్టీలు ఆరాట పడుతున్నాయి.
అనంతపురం ఆర్టీవో కార్యాలయం సమీపంలో పేలుడు జరిగింది. కెమికల్ డబ్బా ఓపెన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి అపార్ట్ మెంట్ వాచ్ మెన్ సతీష్ మృతిచెందాడు.
తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలను నిర్వీర్యం చేసిన కేసీఆర్ కొడుకు కేటీఆర్(KTR)ను ప్రభుత్వం నుంచి తొలగించాలని బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు ప్రభుత్వం వెంటనే ఉద్యోగార్థులకు లక్ష రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు.
సానియా మీర్జా(Sania Mirza).. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయాబ్ మాలిక్(shoaib malik)తో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) పోస్ట్‌లో షోయాబ్ మాలిక్‌ను మళ్లీ అవమానించినట్లు అనిపిస్తోంది. ఆమె రంజాన్‌కు ముందు తన కుమారుడు ఇజాన్‌తో కలిసి ఇఫ్తార్ భోజనం కోసం కూర్చున్నట్లు ఉన్న ఓ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో భర్త షోయాబ్ కనిపించకపోవడం సహా ఆమె తన కుమా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. తమ కుటుంబం గత 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు.
సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ చేశామని చెబుతూ.. కంటికి, పంటి చికిత్స కోసం ఎందుకు ఢిల్లీ వెళుతున్నారని అడిగారు.
ప్రధాని మోడీ విద్యార్హతపై వివాదంపై మనీష్ సిసోడియా స్పందించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన కామెంట్స్‌ను సిసోడియా సమర్థించారు.