గతంలో ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులుగా పని చేసిన వారిని కేసీఆర్ తన వెన్నంటే ఉంచేసుకున్నారు. బిహార్ రాష్ట్రానికి చెందిన సోమేశ్ ను అక్కడి ఎన్నికల్లో పోటీ చేసేలా కేసీఆర్ ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో మధుబని లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు.
తీన్మార్ మల్లన్న టీమ్ లో రాష్ట్ర కన్వీనర్ గా పని చేసిన మాజీ సీఐ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి అరెస్ట్ తో తీన్మార్ మల్లన్న టీమ్ కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే తీన్మార్ మల్లన్న టీమ్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన టీమ్ లోని ప్రధాన వ్యక్తి అరెస్ట్ కావడంతో తీన్మార్ మల్లన్న టీమ్ లో కలకలం రేపింది.
జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన చలాకీ చంటి అనారోగ్యానికి గురై ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె పోటుగా నిర్ధారించి స్టంట్ వేశారు.