Earth quake:న్యూజిలాండ్‌లో భారీ భూకంపం (Earth quake) సంభవించింది. కెర్నాడెక్ దీవుల్లో తీవ్రస్థాయిలో ప్రకంపనాలు వచ్చాయని అమెరికా జియాలజిస్టులు తెలిపారు. దాని తీవ్రత 7.3గా నమోదైందని పేర్కొంది. భూకంప తీవ్రత 10 కిలోమీటర్ల వరకు ఉందని వివరించారు. భూకంపం (Earth quake) తర్వాత సునామీ (tsunami) వచ్చే అవకాశం ఉందని జియోలజిస్టులు చెబుతున్నారు. గత వారం కూడా ఇదే దీవుల్లో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌లో (New Zealand) వచ్చిన భూకంప వల్ల ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
ఇటు భారతదేశంలో గల మేఘాలయ (meghalaya) వెస్ట్ ఖాసీ హిల్స్‌లో సోమవారం భూ ప్రకంపనాలు వచ్చాయి. ఉదయం 7.45 గంటలకు ప్రకంపనాలు రాగా.. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 3.5గా ఉంది. వెస్ట్ ఖాసీ హిల్స్ 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున మేఘాలయలో సౌత్ గారో హిల్స్‌లో కూడా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత కూడా 3.5గా ఉంది.