తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. పెన్నానదిలో అక్రమంగా ఇసుక తరలింపును నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఇసుక తరలింపు పరిశీలనకు వెళ్లాలని నిర్ణయించారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో వంటావార్పుచేయాలనీ పిలుపునిచ్చారు. అయితే ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. జేసీ ఇంటి వద్దకు మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు. బ్యారికేడ్లు పెట్టి టీడీపీ(TDP) నేతలు, కార్యకర్తలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా జేసీ(JC Prabhakar Reddy) నివాసం వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ముందస్తుగా పెద్దపప్పూరు మండలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.