Minister Puvvada Ajay criticize oppositions in the state
Minister Puvvada Ajay:తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్పై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కల్లూరులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో విపక్షాల తీరు ఇలా ఉంది అని విరుచుకుపడ్డారు.
బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amith shah) ముస్లిం రిజర్వేషన్లను తీసివేస్తామని అంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) సెక్రటేరియట్ డూమ్ కూల్చివేస్తామని అంటారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ప్రగతి భవన్లో బాంబ్ పెడతామని చెబుతుంటారు. వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (sharmila) కడప రౌడీయిజం ఇక్కడ చూపిస్తున్నారు.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడికి దిగుతున్నారని అని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ (kcr) దేశం మొత్తానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపితే.. విపక్ష నేతల తీరు ఇలా ఉందన్నారు. బట్ట కాల్చి మీద వేస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పారు. విపక్ష నేతలు ఏం చేసినా.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయదుందుబి మోగిస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) అన్నారు.