హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోన్న 14వ ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. తొలి ఓవర్‌లో పంజాబ్‌కు చెందిన ప్రభుసిమ్రాన్ సింగ్ భువనేశ్వర్ కుమార్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు.
వివాహానికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో వరుడు(bride) వైష్ణవ్ పెళ్లి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అభ్యంతరం వ్యక్తం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్(hyderabad) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బౌద్ద గురువు దలైలామా పిల్లాడితో విచిత్రంగా బిహెవ్ చేశాడు. పెదవులకు ముద్దు పెట్టాడు. ఆ తర్వాత తన నాలుక తీసి.. నాకు అని కోరాడు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) సెల్ఫీ విత్ టిడ్కో ఇళ్ల అంశంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు(MLC Varudu Kalyani) కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ధైర్యముంటే తాము నిర్మించిన 17 వేల కాలనీల వద్దకు రావాలని కోరారు. అక్కడకు వచ్చి లబ్దిదారులతో సెల్ఫీలు దిగాలని సవాల్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ(TDP) హాయంలోనే టిడ్కో ఇళ్లలో భారీగా అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు.
CRPF రిక్రూట్‌మెంట్ కోసం కంప్యూటర్ పరీక్షలో తమిళాన్ని చేర్చకపోవడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్(MK Stalin) వ్యతిరేకించారు. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah)కు లేఖ రాశారు. ఆంగ్లం, హిందీ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ పరీక్ష నిర్వహించాలని కోరారు.
ఎస్‌ఎస్‌సీ పేపర్ లీక్ కేసులో అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ పోయిందని.. వెతికి పెట్టాలని ఆన్ లైన్‌లో కంప్లైంట్ చేశారు.
నటుడు గీతానంద్, నేహా సోలంకి యాక్ట్ చేసిన గేమ్ ఆన్(GameOn) చిత్రాన్ని ఈ సమ్మర్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించగా..రవి కస్తూరి నిర్మాతగా వ్యవహరించారు. మరోవైపు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ మరోసారి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన నిరసన దీక్ష చేపడుతానని ప్రకటించారు. వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.
ఎలిఫెంట్ విస్సరర్స్ నటులు బొమ్మన్ , బెల్లీని ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. తెప్పకడు ఎలిఫెంట్ క్యాంపులో మీట్ అయ్యారు. వారితో దిగిన ఫోటోలను మోడీ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.
నటుడు మంచు మనోజ్(Manchu Manoj) తమకు విలువైన గిఫ్ట్ పంపించినందుకు స్టార్ హీరో రామ్ చరణ్(ram charan), ఉపాసన(Upasana) దంపతులకు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని ఆయన పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా గిఫ్ట్ ఫొటోలను పంచుకున్నాడు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) కపుల్ పేరెంట్స్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముంబై ఖార్‌లోని సంతానోత్పత్తి క్లినిక్ వెలుపల వరుణ్ తన భార్యతో కనిపించిన నేపథ్యంలో వీరిద్దరు వారి మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతోపాటు కొంతమంది ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రధాని మోడీ కామెంట్లకు మంత్రి కేటీఆర్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. అభివృద్ది పనుల సాకు చూపి.. రాజకీయాల కోసమే మోడీ హైదరాబాద్ వచ్చారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
స్టార్ హీరో విక్రమ్(Vikram) పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 17న తన తాజా చిత్రం తంగళన్(Thangalaan) నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు పా రంజిత్(Pa Ranjith) దర్శకత్వం వహిస్తుండగా..జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
ప్రముఖ నటి నయనతార(Nayanthara) 75వ చిత్రం షూటింగ్ మొదలైంది. అయితే గ్రేట్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నీలేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మేరకు షూటింగ్ స్పాట్ నుంచి నీలేష్ కృష్ణ ఓ వీడియోను పంచుకున్నారు.
ఫేమస్ అమెరికన్ సింగర్ టేలర్ అలిసన్ స్విఫ్ట్(taylor swift) తన ప్రియుడి(joe alwyn)తో ఆరేళ్ల తర్వాత విడిపోయింది. ఈ మేరకు స్విఫ్ట్ తన ఇన్ స్టాలో పేర్కొంటూ వెల్లడించింది.