»Sai Dharam Tej Virupaksha Movie Join Rs 50 Crore Club
Virupaksha: 50 కోట్లు కొల్లగొట్టిన ‘విరూపాక్ష’.. ఇకపై అంత లాభమే!
బైక్ యాక్సిడెంట్‌తో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(sai dharam tej).. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. దీంతో ఇకపై సినిమాలు చేయడం తేజ్ వల్ల అవుతుందా? అనే డౌట్స్ వినిపించాయి. కానీ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు సాయి. ఏప్రిల్ 21వ తేదీన విడుదలైన విరూపాక్ష(Virupaksha) మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించగా.. సుకుమార్ కథనం అందించారు. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది.
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర విరూపాక్ష(Virupaksha) దూకుడు మాములుగా లేదు. అసలే ఈ సినిమా సోలోగా బాక్సాఫీస్(box office) దగ్గర బరిలోకి దిగింది. దానికి తోడు అదిరిపోయే టాక్ సొంతం చేసుకుంది. మరి అలాంటప్పుడు విరూపాక్ష కలెక్షన్లు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అరాచకమే అని చెప్పొచ్చు. జస్ట్ త్రీ డేస్‌లోనే 44 కోట్ల గ్రాస్ అందుకున్న విరూపాక్ష.. నాలుగు రోజుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేసింది. నాలుగు రోజుల్లో 50 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు అనౌన్స్ చేశారు మేకర్స్.
ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ 50 కోట్ల(rs 50 crore club) హీరోగా ఫిక్స్ అయిపోయాడు. మొత్తంగా నాలుగు రోజుల్లోనే విరూపాక్ష బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక పై వచ్చేదంతా లాభమే అంటున్నారు. అఖిల్ ఏజెంట్ రిలీజ్ అయ్యే వరకు.. విరూపాక్షకు తిరుగేలేదు. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో(telugu states) సాలిడ్ హిట్ అందుకోవడంతో.. పాన్ ఇండియా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలుద్దాం అని ఆగాం.. అతి త్వరలోనే అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు సాయి ధరమ్ తేజ్(sai dharam tej). ఇండస్ట్రీ వర్గాల ప్రకారం మే 5న హిందీతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. విరూపాక్ష బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపోతోంది.