ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్న ఆదిపురుష్(Adipurush) సినిమాను.. దర్శకుడు ఓం రౌత్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో టీ సిరీస్ సంస్థ విజువల్ వండర్‌గా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఆదిపురుష్ పై మంచి పాజిటివ్ బజ్ నడుస్తోంది. దీంతో మేకర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకే.. ఇదే మూమెంట్లో మరింత పాజిటివ్ హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.
ప్రస్తుతం ఆదిపురుష్(Adipurush) నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు. శ్రీరామనవమికి ప్రభాస్(prabhas) నుంచి ఓ పోస్టర్, హనుమాన్ జయంతికి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. రీసెంట్గా ట్రిబెకా ఫెస్టివల్ కోసం పెట్టిన అప్డేటేట్ టీజర్ క్లిప్ వైరల్ అయింది. ఇక జై శ్రీరామ్ అంటూ సాగే లిరికల్ మోషన్ పోస్టర్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. గత వారం, పది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆదిపురుష్ హవా నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ నుంచి సాలిడ్ అప్డేట్ వస్తే.. మామూలుగా ఉండదు. అందుకే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు ఓం రౌత్.
అయితే ఈ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే విషయంలో క్లారిటీ మిస్ అవుతోంది. సోషల్ మీడియాలో మాత్రం ఓ రెండు డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా నుంచి నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఏప్రిల్ 29న రాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ అప్డేట్ ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఖచ్చితంగా ట్రైలర్ అప్డేట్ వస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
ఇక మరో డేట్ మే 17 అంటున్నారు. ఆరోజే ఆదిపురుష్ ట్రైలర్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే ట్రైలర్ కట్ స్టార్ట్ చేశారట మేకర్స్. మే 17న ఆదిపురుష్ ట్రైలర్ రావడం పక్కా అంటున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. మరి జూన్ 16న బాక్సాఫీస్ దగ్గర ఆదిపురుష్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.