ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం రేపుతోంది. భూపాలపల్లి అడవి నుంచి ఆదివారం రాత్రి జాకారం వద్ద రోడ్డు దాటుతుండగా అంబులెన్స్ డ్రైవర్ గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పంది కుంట నర్సరీలోకి వెళ్లి కంచె దాటే క్రమంలో స్తంభం విరిగినట్లు అధికారులు నిర్ధారించారు. అక్కడ పులి అడుగులను గుర్తించారు.