KMR: కంటి వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని దోమకొండ కంటి వైద్యాధికారి రవీందర్ పటేల్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలో గల బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.