కృష్ణా: మల్లవోలు గ్రామంలోని ఎస్టీ కుటుంబాల తాగునీటి కష్టాలను తీర్చేందుకు ఓ దాత ముందుకొచ్చారు. కాలనీలో నీటి ఎద్దడిని గమనించిన ఆయన సుమారు రూ.30 వేల సొంత నిధులతో పైపులైన్ ఏర్పాటు చేయించారు. ఈ పైపులైన్ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన కుళాయిని ఇవాళ ప్రారంభించారు. ప్రభుత్వ సాయం కోసం వేచి చూడకుండా దాత చేసిన ఈ సాయంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.