టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కీలక సూచనలు చేశాడు. గంభీర్ ముందుగా దేశవాళీ క్రికెట్లో ఏదైనా రంజీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాలని పనేసర్ సూచించాడు. అలా చేయడం వల్ల జట్టు ఎంపికపై అతడికి పూర్తి అవగాహన వస్తుందని పేర్కొన్నాడు. వైట్-బాల్ క్రికెట్లో గంభీర్ కోచింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, టెస్టుల్లో మాత్రం దారుణంగా ఉందన్నాడు.