హిందూ రక్షాదళ్ ప్రజలకు ఆయుధాలు పంపిణీ చేసింది. ఢిల్లీ షాలిమర్ గార్డెన్స్ సమీపంలో స్థానిక ప్రజలకు కత్తులు అందజేశారు. హిందూ సమాజం ఆత్మరక్షణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఆత్మరక్షణ కోసమే ఆయుధాల పంపిణీ చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.