KMR: నాటుబాంబుల పేలుళ్లు కలకలం రేపాయి. ఈ ఘటన KMR మండలంలోని గర్గుల్లో చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. గ్రామానికి చెందిన మొగుళ్ల సాయాగౌడ్కు చెందిన పంట చేనులో శనివారం ఉదయం సాయాగౌడ్ తమ్ముడు రామాగౌడ్ నీళ్లు పారించడానికి వెళ్ళాడు. ఆ సమయంలో భారీ శబ్దం రావడంతో వెళ్లి చూడగా ఓ కుక్క తలపగిలి మృతిచెందింది.