»Young Man Attack With Knife On Woman In Sr Nagar Hyderabad
Attack: ప్రేమను అంగీకరించలేదని.. కళ్లల్లో కారం చల్లి, యువతిపై దాడి..!
ప్రేమ పేరుతో రోజురోజుకు యువతులపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ వివరాలు ఎంటో ఇప్పుడు చుద్దాం.
దేశంలో ప్రేమ ఉన్మాదులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. తమ ప్రేమను అంగీకరించడం లేదని దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోనూ దారుణం చోటుచేసుకుంది. ఎస్ఆర్ నగర్ లో ఓ యువతి పై ప్రేమ పేరిట వేధించాడు. అంగీకరించలేదని, కళ్లల్లో కారం చల్లి కత్తితో దాడి చేశాడు.
ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే… మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువతి 17 ఏళ్లుగా బోరబండ పరిధిలోని బంజారానగర్‌లో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్లో హౌస్‌కీపింగ్‌గా పని చేస్తున్నది. అదే మాల్ లో మోతీనగర్‌కు చెందిన కిశోర్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ ఆరేళ్లుగా పరిచయం ఉంది. తనను ప్రేమించాలని కిశోర్ ఆమె వెంటపడేవాడు. చాలాసార్లు అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా గొడవ పడ్డాడు. కొన్ని రోజుల కింద అమ్మాయికి మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇది తెలుసుకున్న కిశోర్, ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
సోమవారం సాయంత్రం బాధిత యువతి ఇంటికెళ్తుండగా బంజారానగర్‌లో అడ్డుకున్నాడు. కండ్లలో కారం చల్లి కత్తితో దాడి చేశాడు. గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె మెడ, ఎడమ చేతికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కిశోర్ ని పట్టుకుని చితకబాదారు. అమ్మాయిని హాస్పిటల్‌కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, యువతికి ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు.. కిషోర్ పై కేసు నమోదు చేశారు.