»While Watching Videos The Phone Exploded And The Child Died At Kerala
Phone blast: వీడియోలు చూస్తుండగా ఫోన్ పేలి చిన్నారి మృతి
అభం శుభం తెలియని మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి(8 yrs girl) ఆకస్మాత్తుగా మృత్యువాత చెందింది. పోన్లో వీడియోలు చూస్తున్న క్రమంలో మొబైల్ పేలడం(phone blast)తో బాలిక తీవ్ర గాయాల పాలై మరణించింది. ఈ విషాద ఘటన కేరళలోని త్రిసూర్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళ(kerala)లోని త్రిసూర్‌లోని ఓ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక వీడియోలు చూస్తున్న క్రమంలో మొబైల్ ఫోన్ పేలింది(phone blast). సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా, వైద్యులు ప్రయత్నం చేసినప్పటికీ ఆమె కన్నుమూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు.
అయితే చిన్నారి చాలా సేపు వీడియోలు చూస్తున్న క్రమంలో బ్యాటరీ వేడెక్కడం వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు(police) ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఫోరెన్సిక్ పరీక్ష తర్వాతే మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ నిపుణులు ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు ఇప్పటికే చిన్నారి ఇంటికి చేరుకున్నారు. మొబైల్ ఫోన్ పేలుడుపై నిపుణులతో సవివరంగా పరిశీలిస్తామని పోలీసు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఆ ఫోన్‌ను మూడేళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఆదిత్యశ్రీ మామ ఆమె తండ్రి కోసం ఫోన్ కొనుగోలు చేశారు. గతేడాది ఫోన్ బ్యాటరీ(phone battery)ని మార్చారు. ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఆదిత్యశ్రీ, ఆమె అమ్మమ్మ మాత్రమే ఉన్నారు. అమ్మమ్మ ఆహారం తీసుకుని వంటగదికి వెళ్లిన క్రమంలో ఫోన్ పేలింది. దీంతో ఆ చిన్నారి(girl) ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కుడి చేతి వేళ్లు తెగిపోయాయి. అంతేకాదు ఆమె అరచేయి పూర్తిగా విరిగిపోయిందని పోలీసులు తెలిపారు.
తిరువిల్వామలలోని తన ఇంట్లో వీడియో చూస్తున్న నేపథ్యంలో ఎనిమిదేళ్ల బాలిక(girl) చేతిలో మొబైల్ ఫోన్ పేలింది. మృతురాలు పజ్యన్నూరు బ్లాక్ పంచాయతీ మాజీ సభ్యుడు అశోక్‌కుమార్, సౌమ్య దంపతుల కుమార్తె ఆదిత్యశ్రీగా గుర్తించారు.