»Ys Sharmila Was Touched By A Male Si Somewhere Said To Namplayy Court
YS Sharmila: పురుష ఎస్సై ఎక్కడెక్కడో టచ్ చేశారు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లీడర్ వైఎస్ షర్మిల(ys Sharmila)ను నిన్న హైదరాబాద్ లో పోలీసు సిబ్బందిని కొట్టారని ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. ఆ క్రమంలో ఆమె కోర్టుకు తన వాదనలు వినిపించింది. తనకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి తనతో దురుసుగా ప్రవర్తించారని తెలిపింది. అంతేకాదు ఓ పురుష ఎస్సై తనను ఎక్కడెక్కడో టచ్ చేశారని చెప్పింది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల(ys Sharmila)ను నిన్న హైదరాబాద్(hyderabad)లో పోలీసు(police) సిబ్బందిని కొట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీపై విచారణ జరిపిన షర్మిలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) కార్యాలయానికి తరలిస్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.
ఆ క్రమంలో షర్మిలను పోలీసులపై దాడి తర్వాత నాంపల్లి కోర్టు(nampally court)లో హాజరుపరిచారు. మరోవైపు పోలీసులు ఆమెను రిమాండ్ కు ఇవ్వాలని కోర్టును కోరారు. ఆ నేపథ్యంలో ఆమె పోలీసులపై దాడికి గల కారణాలను కోర్టుకు చెప్పింది. పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారని వెల్లడించింది. అసలు వారెంట్ లేకుండా తన ఇంటికి వచ్చి ఎలా అరెస్టు చేస్తారని అన్నారు. అంతేకాదు పురుష పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించి, ఎక్కడెక్కడో టచ్ చేశారని షర్మిల(Sharmila) పేర్కొన్నారు. ఆ క్రమంలో తనను తాను రక్షించుకునేందుకే పోలీసులను నెట్టేసినట్లు తెలిపారు. అసలు మహిళను పురుష పోలీసులు ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు.
మరోవైపు తనకు హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా పోలీసులు ఎలా అడ్డుకుంటారని అన్నారు. ఆ క్రమంలో ఓ పురుష ఎస్సై తనను ఎక్కడెక్కడో తాకడని చెప్పింది. ఈ క్రమంలో తాను దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధమని, కానీ రిమాండ్ మాత్రం ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఇంకోవైపు పోలీసులు షర్మిల తీరుపై కూడా ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఇరు పార్టీల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
అంతేకాదు ఈరోజు వైఎస్ షర్మిల(ys Sharmila) గారి అరెస్ట్(arrest)కు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు YSR తెలంగాణ పార్టీ పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో నేడు అన్ని నియోజక వర్గాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేసేందుకు సిద్దమయ్యారు.