నేటి ఐపీఎల్(IPL) మ్యాచ్లో ఆర్సీబీ(RCB) విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు విజయం పొందింది. టాస్ ఓడిన ఆర్సీబీ(RCB) జట్టు మొదట బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 189 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్(Rajasthan Royals) బ్యాటర్లో దేవదత్ పడిక్కల్ 52 పరుగులు చేశాడు. జట్టును గెలిపించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టాడు. డేవిడ్ విల్లీ, మహ్మద్ సిరాజ్ లు చెరో వికెట్ తీశారు.
మొదటి ఇన్నింగ్స్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) బ్యాటర్లు గ్లెన్ మ్యాక్స్ వెల్ 77 పరుగులు చేశాడు. ఫాఫ్ డుప్లెసిస్ 62 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) డకౌట్ అయ్యాడు. రాజస్థాన్(Rajasthan Royals) బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Aswin), చహల్ చెరో వికెట్ తీశారు.