Sampath: ఆత్మహత్య చేసుకున్న అగ్నిసాక్షి సీరియల్ హీరో
కన్నడ పరిశ్రమలో బుల్లితెర(Small screen) నటుడిగా పలు సీరియల్స్ లో నటిస్తున్నాడు సంపత్(Sampath). కన్నడలో అగ్నిసాక్షి(Agnisakshi) అనే సీరియల్(serial) తో బాగా ఫేమస్ అయ్యాడు. సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా చిన్న పాత్రల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Sampath: ఇటీవల సినీ పరిశ్రమకు గడ్డుకాలం నడుస్తోంది. కొంత కాలంగా సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులు కన్నుమూశారు. మరి కొంతమంది అనారోగ్యంలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా మరో యువనటుడు ఆత్మహత్య చేసుకున్నారు. కన్నడ పరిశ్రమలో బుల్లితెర(Small screen) నటుడిగా పలు సీరియల్స్ లో నటిస్తున్నాడు సంపత్(Sampath). కన్నడలో అగ్నిసాక్షి(Agnisakshi) అనే సీరియల్(serial) తో బాగా ఫేమస్ అయ్యాడు. సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా చిన్న పాత్రల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాజాగా సంపత్ బెంగుళూరు(benguluru)లోని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వయసు 35 ఏళ్లు. చిన్న వయసులోనే ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోవడంతో సన్నిహితులు దిగ్బ్రాంతికి గురయ్యారు. సంపత్ కు ఏడాది క్రితమే వివాహం అయింది. గత కొంత కాలంగా అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్(Depression) కు గురయ్యాడు. ఇంక అతనికి అవకాశాలు రావేమో అని బాధపడుతూ ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని సన్నిహితులు తెలిపారు. సంపత్ మరణంతో తన భార్య, కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలువురు కన్నడ సినీ, టీవీ ప్రముఖులు అతనికి నివాళులు అర్పిస్తున్నారు. అయన స్వగ్రామం కర్ణాటక(Karnataka) మంగుళూరు వద్ద నరసింహరాజపురలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.