ఐపీఎల్(IPL 2023) ఫీవర్ నడుస్తోంది. అన్ని జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. కాగా… ఈ ఐపీఎల్ లో వార్నర్(David Warner) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi capitals) జుట్టులో ఉన్న విషయం తెలిసిందే. కాగా.. ఆయనతో పాటు.. ఇషాంత్ శర్మ చెలరేగిపోవడంతో…గురువారం మ్యాచ్ లో కోల్ కతాపై ఢిల్లీ విజయం సాధించింది.
వార్నర్(David Warner) ఈ ఐపీఎల్ 2023(IPL 2023) సీజన్ లో నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. తొలి ఐదు మ్యాచ్‌ల్లో మెల్లగా ఆడిన వార్నర్.. ఈ మ్యాచ్‌లో మాత్రం తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. కోల్‌కతా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం టీమ్ ని గెలిపించడమే కాదు.. రికార్డు(Record) సొంతం చేసుకున్నాడు.
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లను వెనక్కి నెట్టి మరీ వార్నర్ భారీ మైలురాయిని చేరుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 1075 రన్స్ చేయడం ద్వారా.. ఐపీఎల్లో ఓ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్(David Warner) రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో కోల్‌కతాపై రోహిత్ శర్మ (1040 పరుగులు), చెన్నై సూపర్ కింగ్స్‌పై శిఖర్ ధావన్ (1029 రన్స్) నెలకొల్పిన రికార్డులను వార్నర్ బ్రేక్ చేశాడు. పంజాబ్ కింగ్స్‌పైనా వార్నర్ (1005)వెయ్యికిపైగా రన్స్ చేయడం గమనార్హం. చెన్నై సూపర్ కింగ్స్‌పై 985 రన్స్ చేసిన విరాట్ కోహ్లి ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.