»Naga Chaitanya In Srh Jersey Custody Movie Promotions
Custody Movie: కస్టడీ ప్రమోషన్స్ కోసం IPLని వాడేస్తున్న నాగ చైతన్య
సినిమా ప్రమోషన్స్ లో కొత్త పంథాని పట్టాడు.. అక్కినేని హీరో నాగచైతన్య(naga chaitanya). ఆయన తన కొత్త సినిమా Custody Movie ప్రమోషన్స్ కోసం ఐపీఎల్(IPL)ని వాడటం విశేషం.
నాగ చైతన్య(naga chaitanya) కొత్త సినిమా కస్టడీ మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి కోలివుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, హీరో, దర్శకుడు ఇద్దరూ కలిసి ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటి నుంచే మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఓ ప్రోమోని విడుదల చేశారు. అందులో నాగచైతన్య సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టుకి సపోర్ట్ గా ఆరెంజ్ జెర్సీ ధరిస్తే, డైరెక్టర్ వెంకట్ ప్రభు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ ధరించాడు.
CSK VS SRH మ్యాచ్ సందర్భంగా కస్టడీ హీరో నాగ చైతన్య, డైరెక్టర్ వెంకట్ ప్రభు జియో సినిమాలో కనిపించి సందడి చేయనున్నారు. ఐపీఎల్(IPL) క్రేజ్ ని చాలా తమ సినిమా ప్రమోషన్స్ కి వాడుకోవాలని అనుకున్న ఈ డైరెక్టర్ తెలివికి అక్కినేని అభిమానులు ఫిదా అయిపోతున్నారు. నిజానికి ఐపీఎల్ సమయంలో… ఎంత పెద్ద సినిమా వచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అలాంటి ఎఫెక్ట్ తమ సినిమాకు పడకూడదని, ఏకంగా ఐపీఎల్(IPL)లోనే ప్రమోట్ చేయడం మొదలుపెట్టడం విశేషం.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో బంగార్రాజు విడుదలై సూపర్ హిట్ అయ్యింది. వీరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఈ మూవీలో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తుండగా, ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం అందిస్తున్నారు.