»Big Theft In Tv Actress House More Than 1kg Of Gold And Diamonds At Srinagar Colony Hyderabad
Big theft: టీవీ నటి ఇంట్లో పెద్ద చోరీ…కిలోకు పైగా గోల్డ్, డైమండ్స్ ఖతం
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ తెలుగు టీవీ నటి ఇంట్లో పెద్ద చోరీ(Big theft) జరిగింది. దీంతో కిలోకుపైగా గోల్డ్, వెండి ఆభరణాలను దొంగలు దోచుకెళ్లినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రముఖ సీనియర్ తెలుగు టెలివిజన్ నటి(TV actress) సుమిత్రా పంపన ఇంట్లో దొంగతనం జరిగింది. సోమవారం ఆమె ఢిల్లీకి వెళ్లిన సమయంలో శ్రీనగర్ కాలనీ(srinagar colony)లోని ఆమె ఇంట్లోకి దొంగలు చొరబడి ఖరీదైన వజ్రాలు, బంగారు నగలు దోచుకెళ్లారు. అయితే ఆమె ఏప్రిల్ 17 మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిందని, తాళం వేసి అదే అపార్ట్మెంట్లో ఉంటున్న తన కోడలు భువనేశ్వరికి తాళాలు ఇచ్చిందని తెలిపింది.
అయితే ఏప్రిల్ 18న భువనేశ్వరి ఫ్లాట్ మెయిన్ డోర్ గొళ్లెం విరిగిపోయిన స్థితిలో ఉండటాన్ని గమనించి ఆమె.. బంధువు విజయ్ కుమార్ పంపనకు సమాచారం ఇచ్చింది. దీంతో వారు పంజాగుట్ట పోలీసులకు విషయం తెలిపారు. ఆ క్రమంలో సుమారు 129 తులాల(1.2 కేజీల గోల్డ్) బంగారు(gold), వజ్రాభరణాలు, 293 గ్రాముల వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారని నటి ఆరోపించారు.
కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తన ఫ్లాట్‌లోని మెయిన్ డోర్(door) గొళ్లెం పగులగొట్టి ఫ్లాట్‌లోకి ప్రవేశించారు ఆమె పేర్కొన్నారు. దీంతోపాటు ఇనుప అల్మిరా డోర్‌ను తెరిచి అల్మిరా లాకర్లోని బంగారు, వజ్రాభరణాలను దోచుకెళ్లారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్(hyderabad) వచ్చిన ఆమె వెంటనే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.
457, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు(police) సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ క్రమంలో పలు కోణాల్లో వివరాలను ఆరా తీస్తున్నారు. అసలు తెలిసిన వారే ఈ పని చేశారా? లేదా ఎవరైనా కొత్త వ్యక్తులు చోరీ చేశారా అనే కోణాల్లో సైతం విచారిస్తున్నారు.