»Acid Attack In Middle Of Wedding 12 People Injured At Chhattisgarh Bastar District
Acid Attack: పెళ్లి మధ్యలో యాసిడ్ ఎటాక్…12 మందికి గాయాలు
ఓ పెళ్లి మండపంలో అందరూ పెళ్లి హడావిడిలో సరదాగా గడుపుతున్నారు. అదే క్రమంలో ఒక్కసారిగా కరెంట్ పోయింది. ఆ తర్వాత పెళ్లి మండపం నుంచి ఒక్కసారిగా అరుపులు, శబ్దాలు వినిపించాయి. ఏం జరిగిందని తెలుసుకునే లోపే అనేక మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఎవరో యాసిడ్ దాడి చేశారని తెలుసుకున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా(chhattisgarh bastar district)లో జరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా(chhattisgarh bastar district)లో ఓ వివాహ వేడుకలో విషాద వాతావరణం నెలకొంది. పెళ్లి(wedding) మధ్యలో ఓ గుర్తుతెలియని యువకుడు వధూవరులపై యాసిడ్ దాడి చేసి పారిపోయాడు. ఈ దాడిలో దంపతులు సహా మొత్తం 12 మందికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన భాన్‌పురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే వివాహ వేడుకలో గుర్తు తెలియని వ్యక్తి మొదట లైట్లను ఆఫ్ చేసిన తర్వాత వధూవరులపై యాసిడ్ దాడి(Acid attack) చేసినట్లు అధికారులు గుర్తించారు.
సుధాపాల్ నివాసి 23 ఏళ్ల దమ్రు బాఘేల్, 19 ఏళ్ల సునీతా కశ్యప్ తమ వివాహాన్ని జరుపుకుంటున్న క్రమంలో(wedding time) ఈ ఘటన చోటుచేసుకుంది. చుట్టూ సంతోషం, సరదా వాతావరణం నెలకొన్న క్రమంలో ఒక్కసారిగా తోపులాట, అరుపుల శబ్దం వినిపించిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ దాడిలో వధూవరుల చుట్టూ కూర్చున్న 10 మందిపై యాసిడ్ చల్లారని, దీని కారణంగా వారికి కూడా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. యాసిడ్ తీవ్రత బలంగా ఉండటంతో ఈ ప్రమాదంలో అందరూ తీవ్రంగా గాయపడ్డారు. కానీ ప్రస్తుతానికి అందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడికి ప్రధాన కారణం ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు(police) తెలిపారు. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ప్రేమ కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.