»Delhi High Court Serious On Youtube Channels Over Fake News On Aaradhya Bachchan
Delhi High Court Serious: ఆరాధ్య బచ్చన్ పై ఫేక్ వార్తలు…. హైకోర్టు సీరియస్..!
బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్(aaradhya bachchan)పై ఇటీవల యూట్యూబ్ లో ఫేక్ న్యూస్ వార్తలపై హైకోర్టుDelhi High Court) సీరియస్ అయ్యింది.
గత కొంతకాలంగా.. ఆరాధ్య పై యూట్యూబ్ లో ఫేక్ వార్తలు వస్తున్నాయి. దీంతో ఆరాధ్య బచ్చన్(aaradhya bachchan) కుటుంబం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) గురువారం యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి ఆ వార్తలను తొలగించాలని కోర్టు ఆదేశించింది.
భవిష్యత్తులోనూ ఇలాంటి ఫేక్ వార్తలను వ్యాప్తి చేయరాదు అని యూట్యూబ్(youtube)ను హెచ్చరించింది. యూట్యూబ్‌లో 11 ఏళ్ల ఆరాధ్య ఆరోగ్యం గురించి ఇటీవల ఫేక్ న్యూస్ రిపోర్ట చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సమయంలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ను హైకోర్టు నిలదీసింది.
తప్పుడు కాంటెంట్‌ను పోస్టు చేయకుండా ఉండే పాలసీలు ఏమీ లేవా అని కోర్టు యూట్యూబ్‌ను ప్రశ్నించింది. యూజర్లకు ఓ ఫ్లాట్‌ఫామ్ ఇచ్చేశాం, వాళ్లు ఏది పోస్టు చేసినా తమకు బాధ్యత లేదన్నట్లు యూట్యూబ్ వ్యవహరించడం సరికాదు అని ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) తెలిపింది.
ఐశ్వర్య వేసిన పిటిషన్ ఆధారంగా గూగుల్, యూట్యూబ్‌కు సమన్లు జారీ చేశారు. ఐటీ రూల్స్(it rules) ప్రకారం తమ పాలసీలను మార్చుకున్నారా లేదా అని ప్రశ్నించింది. ప్రతి చిన్నారికి గౌరవంగా, మర్యాదగా జీవించే హక్కు ఉందని, ఫేక్ వార్తలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.