ఏలూరు విద్యానగర్లో దారుణం జరిగింది. ఓ వివాహితపై పలువురు దుండగులు నిన్న రాత్రి యాసిడ్ దాడి చేశారు. రాత్రి ఆ మహిళ స్కూటిపై వెళుతుండగా దుండగులు ఆపి ముఖంపై దాడి చేశారు. బైక్ ను ఆపి యాసిడ్ చల్లి గుర్తుతెలియని వ్యక్తులు పారిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర గాయాలైన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె స్థానిక డెంటల్ క్లినిక్ లో రిసెప్షనిష్టుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమెను మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తీసుకెళ్లారు.